Sunday, October 16, 2011

ఓ యువతా నీ పయనమెటు ......?


ఓ యువతా నీ పయనమెటు ......?

All power is within you
You can do anything and every thing
Believe in that 
యువతనుద్దేశించి  స్వామి వివేకానంద ఉవాచ.
యువత కళలు కనాలి - వాటిని సాకారం చేసుకోవాలి. అబ్దుల్ కలాం ఉర్బోధ.
నేటి బాలబాలికలే రేపటి భావిభారత పౌరులు.
        ఆహా ! ఎంత బాగున్నాయి ఈ నీతి వాక్యాలు . వారన్నది నిజమే. కానీ నేడు అవి ఎలా పక్క దారి పడుతున్నాయో చూడండి 
·        యువశక్తిని రౌడీయిజానికి వినియోగిస్తూ,
·        భవిష్యత్తు గురించి కలలు కనకుండా ప్రేమ కలలుకంటూ,
·        నేటి బాలబాలికలే రేపటి ప్రేమికులు అన్నట్లుగా అర్థాన్నే మార్చేస్తున్న కొంతమంది యువకులను చూస్తే హృదయం ధ్రవించక మానదు.

 పుట్టినందుకేదైనా గట్టిపనీ చేయాలి
 నీవున్నా లేకున్నా నీ పేరు నిలవాలి 

            ప్రేమించడం గొప్పకాదు. ప్రేమించబడటం, అభిమానించబడటం గొప్ప, ప్రేమనేది అమ్మాయి,అబ్బాయి మధ్యగల ప్రేమే కానవసరంలేదు. అది తాత్కాలిక ప్రేమ ఇలాంటిప్రేమ పెళ్లితో ముగుస్తుంది. సమాజంకోసం దేశం కోసం ఏదిచేసినా శాశ్వతంగా అందరి హృదయాల్లో పూజింపబడతారు. 
ఎక్కడో పుట్టిన మదర్ థెరిస్సా సేవ ద్వారా ప్రపంచానికి మదర్ అయింది (మదర్ థెరిస్సా )
కరంచంద్ గాంధీ జాతికే తండ్రి అయ్యాడు. (జాతి పిత )
అబ్దుల్ కలాం యువతరానికే రోల్ మోడల్ అయ్యాడు .
సంకల్పం ఉంటే సాధించలేనిది  ఏదీ లేదు . కానీ ఆసంకల్పం వక్రమైన మార్గానికి ఉపయోగిస్తేనే ప్రమాదం. కొంతమంది యువకులు చేసే పని అదే .
·        బుడి బుడి అడుగులు వేసిన కాళ్లు - నేడు అమ్మాయిల వెంట పరిగెడుతున్నాయి.
·        అమ్మ కోసం వేచి చూసిన కళ్ళు - నేడు అమ్మాయిల కోసం ఎదురుచూస్తున్నాయ్.
·        ''అమ్మా'' అని ముద్దుగా పిలిచిన పెదాలు నేడు బూతులు వల్లిస్తున్నాయ్.
·        కలం పట్టిన చేతులు కత్తులు పడుతున్నాయ్.
·        పాఠాలు చదవవలసిన వయసులో ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు.
·        శిశువులుగా పుట్టి పశువులుగా మారుతున్నారు.
·        మంచిని మాత్రమే చూడవలసిన కళ్ళతో నీలి చిత్రాలు చుస్తున్నారు.
·        మర్మస్థానం కాదది జన్మస్థానమని ఎప్పుడు తెలుసుకుంటారో.

Latest Posts

pages